హైదరాబాద్‌కు మరో వందే భారత్‌... సోమవారం నుంచే

September 21, 2023
img

హైదరాబాద్‌ వాసులకు ఓ శుభవార్త. హైదరాబాద్‌ నుంచి మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సోమవారం నుంచే ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్‌-బెంగళూరు నగరాల మద్య తిరుగబోయే ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 

దీనిని కాచిగూడ రైల్వే స్టేషన్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దక్షిణ మద్య రైల్వే అధికారులతో కలిసి పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. 

ఈ రైలు ప్రతీరోజూ ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మహబూబ్ నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 2.00 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకొంటుంది. 

మళ్ళీ మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడ స్టేషన్ చేరుకొంటుంది. హైదరబాద్-బెంగళూరు మద్య ప్రారంభం కాబోతున్న ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు లేత కాషాయరంగులో చాలా ఆకర్షణీయంగా ఉంది.         


Related Post