రెండువేల ప్రశ్నలు... ఆర్‌బీఐ గవర్నర్‌ వివరణ

May 23, 2023
img

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న హటాత్తుగా రూ.2,000 నోట్లను మార్కెట్ల నుంచి ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించడంతో మళ్ళీ దీనిపై చర్చలు, విశ్లేషణలు, అనుమానాలు, అపోహలు మొదలయ్యాయి. వీటిపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ స్వయంగా వివరణ ఇచ్చారు. 

• సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఉంది కనుక ఆలోగా తాపీగా నోట్లు మార్చుకోవచ్చు. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. 

• రూ.20,000 వరకు ఎటువంటి గుర్తింపు కార్డు చూపకుండానే మార్చుకోవచ్చు. రూ.50,000 వరకు జమా చేసుకోవచ్చు.  

• సెప్టెంబర్‌ 30 నిర్ధిష్టమైన గడువు పెట్టకపోతే ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లు మార్చుకొనేందుకు ఆసక్తి చూపరు. అప్పుడు ఈ ప్రక్రియ సుదీర్గంగా కొనసాగవచ్చు. అది నివారించడానికే గడువు. అయితే గడువు తర్వాత పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకొంటాము. 

• ఇది నోట్లు రద్దు కాదు. కేవలం ఉపసంహరణ మాత్రమే. ‘క్లీన్ కరెన్సీ’ పేరుతో ఈ ప్రక్రియ చాలాకాలంగానే సాగుతోంది. ఇక ముందు కూడా కొనసాగుతుంది. 

• మార్కెట్లలో రూ.2,000 నోట్ల చలామణి చాలా తక్కువగా ఉంది. నగదు రహిత లావాదేవీలు కూడా జోరుగా సాగుతున్నాయి. కనుక ఈ నోట్లు అవసరం లేదు. సామాన్య ప్రజలు ఈ నోట్లను వాడటం లేదు కనుక వారిపై దీని ప్రభావం ఉండదు. 

• మన ఆర్ధిక వ్యవస్థలో కేవలం 10.8శాతం మాత్రమే రూ.2,000 నోట్లు ఉన్నాయి. కనుక వీటి ఉపసంహరణతో దానిపై ఎటువంటి ప్రభావమూ పడదు. 

• ఆర్‌బీఐ నిత్యం మార్కెట్ల ద్రవ్య వినియోగం, అవసరాన్ని నిశితంగా గమనిస్తూ సరిపడా కరెన్సీని ముద్రిస్తూ బ్యాంకుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతుంటుంది. గత వారమే 46,400 కోట్లు విలువగల కరెన్సీని ప్రవేశపెట్టాము. అదీగాక బ్యాంకుల వద్ద తగినంత నగదు నిలువలు ఉన్నాయి. కనుక ఈ నోట్ల మార్పిడికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 

• మళ్ళీ రూ.1,000 నోట్లు లేదా మరో విలువగల నోట్లు ప్రవేశపెట్టడం లేదు. 

• ఈ నోట్ల మార్పిడిపై బ్యాంకులు ఎటువంటి నిఘా పెట్టవు. కానీ భారీ స్థాయిలో జరిగే బ్యాంక్ లావాదేవీలపై ఐ‌టిశాఖ ఎప్పుడూ నిఘా ఉంచుతుంది, అని శక్తికాంత దాస్ చెప్పారు.

Related Post