హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్‌ సర్వీసస్ ప్రారంభం

November 22, 2022
img

అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్‌, డేటా సెంటర్ బిజినెస్‌లో కూడా అగ్రగామిగా ఉంది. ఇప్పటికే భారత్‌లో ముంబైలో 2016లో ఓ కార్యాలయాన్ని స్థాపించింది. యావత్ ఆసియా పసిఫిక్ రీజినల్‌కి కేంద్రంగా హైదరాబాద్‌లో మరో బ్రాంచ్‌ని నేటి నుంచే ప్రారంభించింది. అమెరికా వెలుపల అమెజాన్ వెబ్‌ సర్వీసస్‌కు గల అతిపెద్ద కార్యాలయం, డేటా సెంటర్ ఇదే. రాబోయే 8 ఏళ్లలో రూ.36,300 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు అమెజాన్ వెబ్‌ సర్వీసస్ తెలిపింది. దీని ద్వారా ఏడాదికి సుమారు 48,000 ఉద్యోగాలు, పరోక్షంగా వేలాదిమందికి సంస్థలకి ఉపాది లభించనుంది. 

హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ అతిపెద్ద డేటా సెంటర్‌లో డేటా అనాలిటిక్స్, డేటా సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ రంగాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేస్తామని అమెజాన్ డేటా సర్వీసస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సర్వీసస్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కళ్యాణ్ రామన్ చెప్పారు. 

హైదరాబాద్‌లో ఇప్పటికే అమెజాన్ ఈ కామర్స్ సంస్థకు అతిపెద్ద కార్యాలయం ఉంది. ఇప్పుడు ఈ అమెజాన్ వెబ్‌ సర్వీసస్ సెంటర్ కూడా రావడంతో హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా మరోసారి గుర్తింపు సంపాదించుకొంది.  ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐ‌టి శాఖల మంది కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.            

Related Post