ఇకపై ఆర్టీసీ బస్సులో టేబిల్ ఫ్యాన్, కంప్యూటర్‌కీ టికెట్!

July 20, 2022
img

ఆర్టీసీ బస్సులో టేబిల్ ఫ్యాన్, టీవీ, కంప్యూటర్ వంటి చిన్న వస్తువులు తీసుకువెళుతున్నారా?వాటికీ ఇకపై అదనంగా టికెట్ ఛార్జ్ చెల్లించాల్సిందే అంటోంది టీఎస్‌ఆర్టీసీ. డీజిల్, బస్సుల విడిభాగాలు ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఉద్యోగుల జీతభత్యాల పెంపు తదితర కారణాలన వలన సరుకు రవాణా ఛార్జీలు పెంచక తప్పడం లేదని చెపుతోంది. 2002 నుంచి ఇంతవరకు సరుకు రవాణా ఛార్జీలను పెంచలేదు. ఈ 20 ఏళ్ళలో అన్నిటి ధరలు నాలుగైదు రెట్లు పెరిగిపోయాయి. కనుక ఆర్టీసీ బస్సులలో కూడా సరుకు రవాణా ఛార్జీలు పెంచక తప్పడం లేదని టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. పెంచిన ఈ ఛార్జీలు ఈ శుక్రవారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.  

పల్లె వెలుగు బస్సులలో లగేజీ ఛార్జీల వివరాలు

దూరం (కిమీ)

ప్రస్తుత ఛార్జీ

రూ.

పెంచిన ఛార్జీ

రూ.

0-25

1

20

26-50

2

40

51-75

3

60

76-100

4

70

101-125

5

80

125+

6

90


ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో లగేజీ ఛార్జీల వివరాలు

0-50

2

50

51-100

4

70

101-150

6

90

151-200

8

100

201-250

10

120

251-300

12

140

301-350

14

150

351-400

16

160

401-450

18

170

451-500

20

180

500+

24

200

Related Post