భారీగా తగ్గిన వాణిజ్య సిలెండర్ ధరలు

July 01, 2022
img

ఇంతకాలం పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు నానాటికీ పెరగడమే తప్ప తగ్గడం ఎరుగని ప్రజలకు దేశీయ ఆయిల్ కంపెనీలు ఓ శుభవార్త చెప్పాయి. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.183.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. నేటి నుంచే ఈ తగ్గింపు అమలులోకి వస్తుందని ప్రకటింకాహాయి. దీంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధరలు ఢిల్లీలో రూ.2021, ముంబైలో రూ.1981, హైదరాబాద్‌లో రూ.2242కి తగ్గాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు. కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ సిలిండర్‌ ధరలు భారీగా తగ్గబోతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర ఒక్కటే తగ్గింది.   


Related Post