తెలంగాణలో ఫ్రెష్ టు హోమ్‌ రూ.1,000 కోట్లు పెట్టుబడి

June 24, 2022
img

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నందున రాష్ట్రంలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఫ్రెష్ టు హోమ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు షాన్ కడవిల్ చెప్పారు. గత ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిరేటు ఆరు రెట్లు పెరిగిందని చెప్పారు. తెలంగాణలో తమ సంస్థ ఇప్పటికే వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ దూసుకుపోతోందని కనుక రాబోయే ఐదేళ్ళలో దశల వారీగా మరో వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలిపారు. దీంతో శీతల గిడ్డంగులు, శీతల సౌకర్యం కలిగిన రవాణా వ్యవస్థ, ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు వ్యవస్థకు వినియోగిస్తామని చెప్పారు. 

ఫ్రెష్ టు హోమ్ సంస్థ ప్రధానంగా చేపలు, చికెన్, మాంసం తదితర మాంసాహార ఉత్పత్తులను సరఫరా చేస్తుంటుంది. నూటికి నూరు శాతం ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజసిద్దంగా వాటిని అందజేస్తుంది. 2015లో ప్రారంభమయిన ఫ్రెష్ టు హోమ్ సంస్థకు వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌ నగరాలలో అవుట్ లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో వివిద జిల్లాలకు తమ వ్యాపారకార్యకలాపాలను విస్తరించబోతోంది.

Related Post