టీఎస్‌ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీల భారీగా పెంపు

June 10, 2022
img

మునిగిపోతున్న నావలా నష్టాల, కష్టాల కడలిలో సాగుతున్న టీఎస్‌ఆర్టీసీ ఒడ్డున పడేందుకు డీజిల్ సెస్ పేరుతో టికెట్ ఛార్జీలను పెంచింది. ఇప్పుడు వివిద రకాల బస్ పాస్ ఛార్జీలను కూడా భారీగా పెంచేసి సామాన్య ప్రజలను దూరం చేసుకొంటోంది. ముఖ్యంగా సిటీ బస్సులలో కాలేజీలకు వెళ్ళే పేద  విద్యార్దులకు ఇది పెను భారమే అవుతుంది. టీఎస్‌ఆర్టీసీ పెంచిన ఛార్జీలు ఈవిదంగా ఉన్నాయి. 

4 కిమీలోపు రూట్ పాస్ ఛార్జీని రూ.165 నుంచి రూ.450, 

8 కిమీలోపు రూట్ పాస్ ఛార్జీని రూ.200 నుంచి రూ.600, 

12 కిమీలోపు రూట్ పాస్ ఛార్జీని రూ.245 నుంచి రూ.900, 

18 కిమీలోపు రూట్ పాస్ ఛార్జీని రూ.280 నుంచి రూ.1,150, 

22 కిమీలోపు రూట్ పాస్ ఛార్జీని రూ.330 నుంచి రూ.1,350కి పెంచేసింది.

Related Post