ఇక రేషన్ డిపోలలో మినీ గ్యాస్ బండలు

May 14, 2022
img

రేషన్ డీలర్లకు, తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకు ఓ శుభవార్త. త్వరలో రేషన్ షాపులలో 5 కేజీల మినీ గ్యాస్ సిలెండర్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే అవసరం, అవకాశం ఉన్న చోట రేషన్ షాపులలో ఇంటర్నెట్ కేఫ్‌లు కూడా ఏర్పాటు చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు మరో 14 రకాల సేవలు కూడా రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు అందించాలని నిర్ణయించారు.

 దీని ప్రధానోద్దేశ్యం ప్రజలకు మరింత సదుపాయాలు అందజేయడమే. వీటితో రేషన్ డీలర్లకు అదనపు కమీషన్‌ వచ్చేలా చేసి వారిని ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో గ్యాస్ సిలిండర్ ద్వారా రేషన్ డీలరుకి రూ.41 కమీషన్‌ లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మొదటిసారి సిలెండర్ కొరకు సెక్యూరిటీ డిపాజిట్‌తో కలిసి మొత్తం రూ.940 చెల్లించాల్సి ఉంటుంది. మరుసటి నెల నుంచి రూ.620 చెల్లిస్తే సరిపోతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెపుతున్నారు. త్వరలోనే ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కేవలం రేషన్ కార్డులు కలిగినవారే కాకుండా ఆధార్ కార్డు చూపి ఎవరైనా గ్యాస్ సిలెండర్ పొందవచ్చునని అధికారులు తెలిపారు. 

Related Post