రూ.250 కోట్లు పెట్టుబడితో హైదరాబాద్‌కు మరో భారీ పరిశ్రమ

May 12, 2022
img

హైదరాబాద్‌కు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. అమెరికాకు చెందిన రేవ్ గేర్, తెలంగాణకు చెందిన రఘువంశీ మెషీన్ టూల్స్ కలిసి రూ.250 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఓ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నాయి. దీనిలో హెలికాప్టర్‌లో వినియోగించే గేర్లు, గేర్ బాక్స్ తయారుచేస్తారు. టెక్సాస్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న రేవ్ గేర్స్ ఈ రంగంలో చిరకాలంగా ఉంది. అదేవిదంగా రఘువంశీ మెషీన్ టూల్స్ కూడా చిరకాలంగా ఆటోమోటివ్, ఏవియేషన్ రంగాలకు అవసరమైన యంత్రాలను, యంత్ర పరికరాలను తయారుచేస్తోంది. ఇప్పుడు ఈ రెండు కలిసి స్కందా ఏరో స్పేస్ ప్రొడక్షన్స్ పేరుతో హైదరాబాద్‌లో పరిశ్రమను చేయబోతున్నాయి.

 అమెరికాకే చెందిన కాల్‌అవే గోల్ఫ్ కంపెనీ కూడా హైదరాబాద్‌లో రూ.150 కోట్లు పెట్టుబడితో అతిపెద్ద డిజిటెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రాయదుర్గం వద్ద గల నాలెడ్జ్ సెంటర్‌లో ఆ సంస్థ కార్యాలయాన్ని తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించారు.


Related Post