హైదరాబాద్‌కు మరో మల్టీ నేషనల్ కంపెనీ...గ్రిడ్ డైనమిక్స్

May 09, 2022
img

హైదరాబాద్‌కు మరో మల్టీ నేషనల్ కంపెనీ వస్తోంది. ఔత్సాహిక ఐటి నిపుణులకు అవసరమైన సేవలను అందించే గ్రిడ్ డైనమిక్స్ హోల్డింగ్స్ కంపెనీ భారత్‌లో తన మొట్టమొదటి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులు నేడు ప్రగతి భవన్‌కు వచ్చి తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ ఏడాది చివరినాటికి తమ సంస్థలో 1,000 మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులకు తమ కంపెనీలో ఉద్యోగాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. హైదరాబాద్‌లో మంచి వ్యాపారవకాశాలు, అన్ని సౌకర్యాలు, అన్ని రంగాలలో మంచి అనుభవం ఉన్న నిపుణులు, ఇంజనీర్లు లభ్యమవుతారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు పూర్తి సహాయసహకారాలు అందించేందుకు ముందుకు రావడంతో హైదరాబాద్‌లో తమడ్ డైనమిక్స్ హోల్డింగ్స్ కంపెనీని ప్రారంభించబోతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలో హైదరాబాద్‌ను ఎంచుకొన్నందుకు మంత్రి కేటీఆర్‌ వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.   


Related Post