టీఎస్‌ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం భేష్

January 19, 2022
img

ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ జనవరి 7వ తేదీ నుంచి 17వరకు 4,000 ప్రత్యేక బస్సులను నడిపించింది. వాటి ద్వారానే టీఎస్‌ఆర్టీసీకి రూ.107 కోట్లు అదనపు ఆదాయం లభించింది. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకు కలిపి రోజుకి రూ.9-10 కోట్లు వరకు ఆదాయం వస్తుంటుంది. కానీ ఈ సంక్రాంతి ప్రత్యేక బస్సుల ద్వారానే సగటున రోజుకి రూ. 9.75 కోట్లు ఆదాయం వచ్చిందని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ నెల 17వ తేదీన అత్యధికంగా రూ.12.21 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. టికెట్ ధర పెంచకుండా నడిపిస్తేనే రూ.107 కోట్లు అదనపు ఆదాయం వచ్చింది అదే...పదో పాతికో టికెట్ ధరలు పెంచి ఉంటే ఇంకా ఎక్కువే వచ్చి ఉండేది. అయితే టీఎస్‌ఆర్టీసీ కూడా నైతిక విలువలకు కట్టుబడి పనిచేయాలని, సామాన్య ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసి సజ్జనార్‌ సూచన మేరకు సంక్రాంతి ప్రత్యేక బస్సులలో కూడా ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా నడిపించి టీఎస్‌ఆర్టీసీ అందరి మన్ననలు అందుకొంది.  


Related Post