సంక్రాంతి స్పెషల్ బస్సులు హైదరాబాద్‌లో బయలుదేరే ప్రాంతాలు

January 13, 2022
img

రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిసి ఉన్నప్పటికీ ‘తగ్గేదేలే... ‘ అంటూ అందరూ సంక్రాంతి పండుగకు ఊర్లకు బయలుదేరిపోతున్నారు. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ, ఏపీలోని వివిద జిల్లాలకు బయలుదేరేవారితో బస్టాండులు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎన్ని ప్రత్యేక రైళ్ళు, బస్సులు వేసినా సరిపోవడం లేదు. ప్రయాణికుల సౌకర్యార్ధం హైదరాబాద్‌ నగరం నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళే బస్సులకు వేర్వేరు బస్టాండ్స్ నుంచి బయలుదేరేలా ఏర్పాటు చేసిన్నట్లు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఆ వివరాలు... 

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్ వైపు వెళ్ళే బస్సులు ఉప్పల్ నుంచి బయలుదేరుతాయి. 

హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, నిర్మల్ నిజామాబాద్‌, గోదావరిఖని, అదిలాబాద్ వైపు వెళ్ళే బస్సులు జేబీఎస్ బస్టాండ్ నుంచి బయలుదేరుతాయి. 

హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, ఖమ్మం, రాయచూరువైపు వెళ్ళే బస్సులు ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి బయలుదేరుతాయి. 

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్ళే బస్సులు దిల్‌సుక్‌నగర్‌ నుంచి బయలుదేరుతాయి. 

హైదరాబాద్‌ నుంచి రాయలసీమ జిల్లాలకు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. 

Related Post