ఆగస్ట్ 31వరకు అంతర్జాతీయ విమాన సేవలు రద్దు

July 31, 2021
img

భారత్‌తో సహా ప్రపంచదేశాలలో మళ్ళీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేంద్రప్రభుత్వం అంతర్జాతీయ విమాన సేవలపై జూలై 31వరకు విధించిన నిషేధాన్ని మరో నెలరోజులపాటు అంటే ఆగస్ట్ 31వరకు పొడిగించింది. వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికా, కెనడా, ఫ్రాన్స్, యూకె, యుఏఈ, తదితర 24 దేశాలతో భారత్‌ ప్రత్యేక ఒప్పందాలు చేసుకొంది. ఆ దేశాలకు మాత్రం పరిమిత సంఖ్యలో విమానసేవలు కొనసాగుతాయి. దేశీయ విమానసేవలకు, అంతర్జాతీయ కార్గో విమానసేవలకు ఈ నిషేధం వర్తించడాని కేంద్రప్రభుత్వం తెలియజేసింది. 

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా విజృంభిస్తుండటంతో మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సేవలపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. అప్పటి నుంచి నిషేధం కొనసాగుతూనే ఉండటంతో అంతర్జాతీయ విమాన సేవలను అందించే విమానయాన సంస్థలు దివాళా స్థితికి చేరుకొంటున్నాయి. పలు సంస్థలు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోవడంతో ఉద్యోగులు..వారి కుటుంబాలు తీవ్ర ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నారు. అలాగే ఉద్యోగాలు, వ్యాపారాల కోసం విదేశాలనుంచి నుంచి భారత్‌కు రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ కరోనా కారణంగా ఎవరూ ఏమీ చేయలేని నిసహాయ పరిస్థితులు ఏర్పడ్డాయి.

Related Post