హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి

July 29, 2021
img

హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. సోలార్ విద్యుత్ పరికరాలను తయారీ రంగంలో ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ రూ.483 కోట్లు పెట్టుబడితో హైదరాబాద్‌లో ఇప్పటికే లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దానిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభోత్సవం చేస్తారు. 750 మెగావాట్స్ సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ ప్లాంటులో వివిద రకాల సోలార్ విద్యుత్ పరికరాలు ఉత్పత్తి చేస్తారు.  

ఆ ప్లాంట్ విస్తరణతో పాటు కొత్తగా మరో ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు సుందర్ పాల్ సింగ్‌ ప్రకటించారు. దీనికోసం రూ.1,200 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలిపారు. ముందుగా రాబోయే 4 నెలల్లో రూ.500 కోట్లు ఖర్చుతో ఓ గిగావాట్ సామార్ధ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాబోయే రెండేళ్లలో రూ.1200 కోట్లు పెట్టుబడితో ప్లాంట్ సామర్ధ్యం 3 గిగావాట్లకు పెంచుతామని సుందర్ పాల్ సింగ్‌ చెప్పారు.     


Related Post