ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించిన కోకాపేట

July 16, 2021
img

హైదరాబాద్‌ శివార్లలో కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్‌లోని భూముల ఆన్‌లైన్‌ వేలంపాట ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. అధికారులు ఎకరాకు కనిష్ట ధర రూ.25-31. 2 కోట్లు నిర్ణయించగా వేలంపాటలో ఎకరం గరిష్టంగా రూ.60.20 కోట్లు పలికింది. మొత్తం మీద చూసుకొంటే ఎకరం సగటున రూ.40. 05కోట్లు పలికింది. ఈ వేలంపాటలో మొత్తం 60 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో వేలంపాట మొదలవగానే పోటాపోటీగా ధర పెంచుకొంటూపోయి ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించారు. మొత్తం 50 ఎకరాలను 8 ప్లాట్లుగా విభజించి వేలం వేయగా అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ వేలంపాట ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.2000.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ వేలంపాట హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ సత్తా ఏమిటో మరోసారి చాటి చూపిందని చెప్పవచ్చు. 

ఈ వేలంపాటలో నెంబరు: 2/పీ వెస్ట్ పార్ట్ ప్లాటులోని 1.65 ఎకరాలను రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్లు చొప్పున మొత్తం రూ.99.33 కోట్లు చెల్లించి సొంతం చేసుకొంది. ఈ వేలంపాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ప్లాట్ ఇదే.   

వీటిలో ఒక ఎకరం విస్తీర్ణం కాగిగిన ప్లాట్ నెంబర్: ఏను హెచ్‌ఎండీఏ నిర్ణయించిన కనిష్టధర రూ.31.2 కోట్ల చొప్పున  హైమా డెవలపర్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈవేలంపాటలో అత్యంత తక్కువ ధరకు అమ్ముడుపోయిన ప్లాట్ ఇదొక్కటే. 

కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉండటం, దానిలో 20-30 అంతస్తుల భవనాలు కట్టుకొనేందుకు ప్రభుత్వం అనుమతిస్తుండటంతో వేలంపాటలో బిడ్డర్లు పోటీపడి కొనుగోలు చేశారు. వేలంపాట వివరాలు: 

ప్లాట్ (ఎకరాలలో)

ఎకరాకు చెల్లించిన ధర (కోట్లలో)

అమ్ముడైన ధర (కోట్లలో)

దక్కించుకొన్న వ్యక్తి, సంస్థ పేరు

7.721

42.2

325.83

మన్నే సత్యనారాయణ రెడ్డి

7.755

42.4

328.81

రాజపుష్ప ప్రాపర్టీస్

7.738

36.4

281.66

ఆక్వా స్పేస్ డెవలపర్స్

7.564

37.8

285.92

ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్

8.946

39.2

350.68

ఆక్వా స్పేస్ డెవలపర్స్

7.575

39.2

296.94

వర్శిటీ ఎడ్యుకేషన్ మేనేజిమెంట్

1

31.2

31.2

హైమా డెవలపర్స్ లిమిటెడ్

1.65

60.2

99.33

రాజపుష్ప ప్రాపర్టీస్

Related Post