తెలంగాణలో జిల్లాకో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు

July 15, 2021
img

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన బుదవారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర లాజిస్టిక్ (సరుకు రవాణా) పాలసీకి దానికి సంబందించి మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేశారు. ఆ వివరాలు: 

• రాష్ట్రంలో 1,400 ఎకరాలలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ (డ్రైపోర్టు) ఏర్పాటు. 

• లాజిస్టిక్ పార్కుల ద్వారా రాష్ట్రానికి రూ.10,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యం.  బాటసింగారంలో ఏర్పాటు చేసినట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా 10 ఇంటిగ్రేటడ్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు. 

• ప్రతీ జిల్లాలో ఓ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు. 

• ఐసీడీ తరహాలో మరో రెండు ఇంటిగ్రేటడ్ కంటెయినర్ డిపోలు ఏర్పాటు. 

• లాజిస్టిక్ రంగంలో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కొరకు అంతర్జాతీయ స్థాయిలో సెంటర్‌లో ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు. 

• ఈ లాజిస్టిక్ పార్కులలో గోదాములు, వివిద సరుకు రవాణా కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, వ్యక్తులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు లభిస్తాయి. 

• లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి కల్పనకు అవకాశం.

Related Post