మీ మీటర్ రీడింగ్ మీరే తీసి బిల్లు పొందండి ఇలా..

May 06, 2021
img


తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఈనెల నుంచి కొత్త బిల్లింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటింటికి తిరిగి స్పాట్ బిల్లింగ్ చేసేందుకు వీలులేకపోవడంతో వినియోగదారులే స్వయంగా ‘సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్’ ద్వారా మీటర్ రీడింగ్ పంపించినట్లయితే ఎంత కరెంటు ఛార్జీలు ఎంత చెల్లించాలో సమాచారం వస్తుంది. దానిని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. అయితే ఈ సదుపాయం మే నెల మాత్రమే అందుబాటులో ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. 

వినియోగదారులు ముందుగా  ప్లే స్టోర్ నుంచి ‘టీఎస్‌న్‌పీడీసీల్ ఐటీ వింగ్’ అనే మొబైల్ యాప్‌ను ఫోన్లో డౌన్‌లోడ్‌  చేసుకోవాలి. ఆ తర్వాత సెల్ఫ్ మీటర్ రీడింగ్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి అందులో యూనిక్ సర్వీస్ నెంబర్, మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి. అప్పుడు ఆ యాప్ లో ఉండే స్కానర్ ద్వారా విద్యుత్తు మీట ర్‌ రీడింగ్‌ను స్కాన్ చేసి పంపించాలి. ఆ తర్వాత అదే మొబైల్ నెంబర్‌కు మెసేజ్ రూపంలో బిల్లు వస్తుంది. ఇంకా ఏమైనా విద్యుత్  సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 028 లేదా 1912 నెంబర్లలో సంప్రదించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.


Related Post