హైదరాబాద్‌ మెట్రో రైల్‌ టైమింగ్స్‌లో మార్పు

April 20, 2021
img

నేటి రాత్రి నుంచి మే 1వరకు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేయబోతున్నందున హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సర్వీసులలో ఈ మేరకు స్వల్ప మార్పులు చేశారు. నేటి నుంచి చివరి మెట్రో రైల్‌ రాత్రి 7.45 గంటలకు బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు 8.45 గంటలకు చేరుకొంటుంది. మొదటి మెట్రో రైల్‌ యధాప్రకారం ఉదయం 6.30 గంటలకు బయలుదేరుతుంది. మే 1వరకు నగరంలో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది కనుక అప్పటి వరకు మెట్రో ఇదే సమయాలు అమలులో ఉంటాయని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. 

కర్ఫ్యూ అమలులోకి వస్తున్నందున రాత్రి 8.30 తరువాత నగరంలో సిటీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు కూడా రోడ్లపై తిరుగవు కనుక హైదరాబాద్‌ వాసులు, ముఖ్యంగా మెట్రో ప్రయాణికులు అందరూ ఈ మార్పులను గమనించి రాత్రి వీలైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడం మంచిది. 

Related Post