నేటి నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు షురూ

April 19, 2021
img

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. కేంద్రప్రభుత్వం సూచన మేరకు రైల్వేశాఖ త్వరలో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవిషయం ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ముంబైలోని కలంబోలి, బోయిసర్ రైల్వేస్టేషన్ల నుంచి దేశంలో ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఆక్సిజన్ రవాణా చేస్తామని తెలిపారు. దీనికోసం విశాఖపట్నం, జంషెడ్‌పూర్,రూర్కెలా, బొకారో స్టేషన్ల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను వేగన్లపై ఎక్కించుకొని తీసుకువెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పీయూష్ గోయల్‌ తెలిపారు. ఈ ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లు సోమవారం బయలుదేరి ముంబై చేరుకొంటాయని తెలిపారు. అక్కడ ఆక్సిజన్ నింపుకొన్న తరువాత ప్రాధాన్యతా క్రమంలో వాటిని దేశంలో వివిద ప్రాంతాలకు పంపిస్తామని చెప్పారు. ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లకు వీలైనంత వేగంగా తమ గమ్య స్థానాలు చేరుకొనేందుకు ‘గ్రీన్‌ కారిడార్లు’ కూడా ఏర్పాటుచేస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.               


Related Post