సిరిసిల్లా జిల్లాలో గోకుల్‌దాస్‌ టెక్స్‌టైల్‌ కంపెనీ

April 09, 2021
img

తెలంగాణలో మరో టెక్స్‌టైల్‌ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. ప్రముఖ టెక్స్‌టైల్‌ కంపెనీ ‘గోకుల్‌దాస్‌ ఇమేజెస్’ రాజన్న సిరిసిల్ల జిల్లాలో టెక్స్‌టైల్‌ పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,100 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా తమ సంస్థలో మహిళలకు ఉద్యోగావకాశాలు ఎక్కువ ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

శుక్రవారం ప్రగతి భవన్‌లో పరిశ్రమలశాఖా మంత్రి కేటీఆర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ ఐఐసి ఎండి వెంకట నర్సింహారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, గోకుల్‌దాస్‌ ఇమేజెస్ సంస్థ ఎండి సుమీర్ హిందూజాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జయేశ్ రంజన్, గోకుల్‌దాస్‌ సంస్థ ఎండీ అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 


Related Post