హైదరాబాద్‌లో మరో అమెరికన్ కంపెనీ ఏర్పాటు

April 07, 2021
img

హైదరాబాద్‌కు మరో అమెరికన్ కంపెనీ తరలివచ్చింది. అమెరికాలో మిన్నెసోటా కేంద్రంగా వైద్య పరికరాలను తయారుచేసే ప్రసిద్ద మెడ్‌ట్రానిక్ కంపెనీ హైదరాబాద్‌లో రూ.1,200 కోట్లతో ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ బుదవారం నానక్‌రామ్‌గూడాలో మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్ సెంటర్‌కు ప్రారంభోత్సవం చేశారు. మెడ్‌ట్రానిక్ కంపెనీ అమెరికా వెలుపల ఏర్పాటు చేస్తున్న తొలి కేంద్రం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “హైదరాబాద్‌ నగరంలో గూగుల్, అమెజాన్, ఆపిల్, ఫేస్‌బుక్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ కూడా వచ్చింది. ఈ సంస్థ ప్రపంచంలో 140 దేశాలలో తన వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న ఈ కంపెనీ ద్వారా ఇంజనీరింగ్, హెల్త్ సైన్సస్ రంగాలకు చెందిన సుమారు 1,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.        


Related Post