ఆస్తిపన్ను బకాయిల చెల్లింపుకు వన్ టైమ్ సెటిల్‌మెంట్

March 04, 2021
img

రాష్ట్రంలోని ఆస్తిపన్ను బకాయిల చెల్లింపుకు తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీన వన్ టైమ్ సెటిల్‌మెంట్ పధకం ప్రకటించింది. దానిని మార్చి నెలాఖరువరకు పొడిగిస్తూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ బుదవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వన్ టైమ్ సెటిల్‌మెంట్ పధకంలో మార్చి నెలాఖరులోగా 2019-2020 ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేవారికి బకాయిలపై వడ్డీలో 90 శాతం మాఫీ చేయబడుతుంది. ఈ పధకం జీహెచ్‌ఎంసీతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు కూడా వర్తిస్తుంది. 

ఆస్తిపన్ను, నీటి ఛార్జీలు, లీజుకిచ్చిన దుకాణాల అద్దెలు వగైరా వసూలు చేసేందుకు మార్చి నెలాఖరువరకు ప్రతీ సోమ, బుద, ఆదివారంతో పాటు సెలవు రోజులలో కూడా రాష్ట్రవ్యాప్తంగా పన్నుల వసూలు మేళాలు నిర్వహించబోతున్నారు. కనుక ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పురపాలకశాఖ విజ్ఞప్తి చేసింది. 


Related Post