ఇకపై వాట్సప్‌ ద్వారా ప్రోపర్టీ టాక్స్ చెల్లించవచ్చు

February 27, 2021
img

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ, వాట్సప్ సహాయంతో కొత్త సేవలను ప్రారంభించింది. ఇకనుంచి రాష్ట్రంలో హైదరాబాద్  మినహా మిగతా 32 జిల్లాలలో ప్రాపర్టీ టాక్స్‌ను వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. వాట్సాప్ నెంబర్ 900025334కు హాయ్ అని టైప్ చేసి మెసేజ్ పంపిస్తే ఆటోమేటిక్‌గా జిల్లాల  వివరాలు వస్తాయి. వాటిలో మీ జిల్లాను ఎంచుకొని మీ ఇంటి నెంబర్ ఎంటర్ చేస్తే ప్రాపర్టీ టాక్స్ వివరాలు వస్తాయి. వచ్చిన ప్రాపర్టీ టాక్స్‌ను వాట్సప్‌లోని పేమెంట్ ఆప్షన్ ద్వారా చెల్లించవచ్చు. అయితే ముందుగా మీ వాట్సప్‌కు మీ బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. దాని కోసం ముందుగా వాట్సప్‌ సెటింగ్స్‌లో ఉండే పేమెంట్ బటన్ నొక్కినట్లయితే బ్యాంకుల జాబితా వస్తుంది. దానిలో మీఖాతా ఉన్న బ్యాంక్‌ను ఎంచుకొన్నాక మీ ఫోన్‌ నుంచి మీ బ్యాంక్‌కు ఓ సందేశం పంపిస్తుంది. అది ఒకే అయితే మీ వాట్సప్‌లో పేమెంట్ ఆప్షన్‌ వచ్చేసినట్లే. దాని ద్వారా మీ ప్రాపర్టీ టాక్స్ వగైరా చాలా సులువుగా చెల్లించవచ్చు.   


Related Post