ఏప్రిల్ 1 నుంచి మరో 11 జతల రైళ్ళు షురూ

February 25, 2021
img

గత ఏడాది మార్చిలో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు అనేక వేల రైళ్ళు మూలపడి ఉన్నాయి. ఆ తరువాత క్రమంగా రైల్వేశాఖ ప్రత్యేక రైళ్ళ పేరుతో 138 జతల రైళ్ళను తిప్పుతున్నప్పటికీ 135 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌కు ఏమాత్రం సరిపోవడంలేదు. దాంతో ప్రజలు... ముఖ్యంగా సామాన్య ప్రజలు దూరప్రాంతాలకు వెళ్ళిరావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో దాదాపు అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పటికీ ఒక్క రైల్వేశాఖ మాత్రమే ఇంకా కరోనా సాకుతో రైళ్ళు తిప్పకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహుశః అందుకే రైల్వేశాఖ మేల్కొని ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీలోగా 11 జతల రైళ్ళను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. 

రైలు నెంబర్

ఎక్కడి నుంచి

ఎక్కడి వరకు

ఏ రోజున

02799

విజయవాడ

సికింద్రాబాద్‌

ప్రతీరోజు

02800

సికింద్రాబాద్‌

విజయవాడ

ప్రతీరోజు

07251

గుంటూరు

కాచిగూడ

ప్రతీరోజు

007252

కాచిగూడ

గుంటూరు

ప్రతీరోజు

02739

సికింద్రాబాద్‌

విశాఖపట్నం

ప్రతీరోజు

02740

విశాఖపట్నం

సికింద్రాబాద్‌

ప్రతీరోజు

07409

ఆదిలాబాద్

నాందేడ్

ప్రతీరోజు

07410

నాందేడ్

ఆదిలాబాద్

ప్రతీరోజు

02735

సికింద్రాబాద్‌

యశ్వంత్‌పూర్

బుద, శుక్ర, ఆదివారం

02736

యశ్వంత్‌పూర్

సికింద్రాబాద్‌

సోమ, గురు, శనివారం

07207

విజయవాడ

సాయినగర్ (షిర్డీ)

మంగళవారం

07208

సాయినగర్ (షిర్డీ)

విజయవాడ

బుదవారం

07621

ఔరంగాబాద్

రేణిగుంట

శుక్రవారం

07622

రేణిగుంట

ఔరంగాబాద్

శనివారం

Related Post