మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

January 23, 2021
img

చమురు ధరలను మరోసారి రెక్కలు వచ్చాయి. గడిచిన రెండు రోజులుగా చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం మూలంగా చమురు ధరలు స్వల్పంగా పెంచినట్టు చమురు సంస్థలు తెలిపాయి. లీటర్ పెట్రోలు, డీజిల్‌పై 25 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఈ పెంచిన చమురు ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చినట్లు తెలిపాయి.

రోజురోజుకీ పెరుగుతున్న ఈ చమురు ధరలను చూస్తుంటే త్వరలోనే లీటర్ పెట్రోల్ రూ.100 దాటిపోయేలాగ కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ సామాన్యుని నెత్తిన గుదిబండలా తయారయ్యాయి. ఇప్పుడు నిత్యం పెరిగే చమురు ధరలతో ప్రజలు మరింత భారం మోయక తప్పడంలేదు.  


Related Post