చైనాకు భారత్‌ మరో పెద్ద షాక్

June 30, 2020
img

భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు భారత్‌ వరుసగా షాకులు ఇస్తోంది. చైనాకు చెందిన టిక్ టాక్, హలో,  షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, బైదు మ్యాప్ వంటి మొత్తం 59 యాప్‌లను నిషేదిస్తున్నట్లు సోమవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి శాఖ ప్రకటించింది. వాటి ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం దొంగతనం అవుతోందని, వాటిలో కొన్నిటి వలన దేశభద్రత, రక్షణకు ముప్పు ఉన్నందున నిషేదించాలని భారత్‌ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, భారత్‌ నిఘా వర్గాల సూచన మేరకు సెక్షన్ 69-ఆ ప్రకారం నిషేదిస్తున్నట్లు ప్రకటించింది. అయితే చైనాకు బుద్ది చెప్పాలనే ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు భావించవచ్చు. వీటిని తక్షణమే నిషేదించాలని అన్ని టెలికాం కంపెనీలకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం నిషేదించిన చైనా యాప్‌లు ఇవే:       


Related Post