ఇస్రో ప్రయోగానికి స్వల్ప అవరోధం

December 11, 2019
img

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగాలను ఈ ప్రపంచంలో ఆపగల ఏకైక శక్తి ఏది? కేంద్రప్రభుత్వమా కాదు…నిధుల కొరత కూడా కాదు. సాంకేతిక సమస్యలు కూడా కావు. మరేమిటంటే రాహుకాలం. అవును రాహుకాలమే!

బుదవారం మధ్యాహ్నం 3.25 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వీ-సి48 ద్వారా 10 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది. దాని కోసం మంగళవారం సాయంత్రం 4.25 గంటల నుంచి కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కావలసి ఉంది. కానీ ఆ సమయంలో రాహుకాలం ఉన్నందున అది పూర్తయిన తరువాత అంటే 4.40 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు ఇస్రో శాస్త్రవేత్తలు. అయితే పిఎస్ఎల్వీ-సి48 ప్రయోగ సమయాన్ని మాత్రం మార్చలేదు. బుదవారం మధ్యాహ్నం 3.25 గంటలకు పిఎస్ఎల్వీ-సి48 ద్వారా భారత్‌కు చెందిన రీశాట్-2బిఆర్ 1 ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను నేడు ఇస్రో అంతరిక్షంలో ప్రవేశపెట్టనుంది.             


Related Post