నాసా కూడా కనిపెట్టలేకపోయింది

September 19, 2019
img

చంద్రుడి ఉపరితలంపై పడిపోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనిపెట్టి దానితో మళ్ళీ కమ్యూనికేషన్ నెలకొల్పుకోవడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దాంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహాయం కోరారు. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన ఎల్‌ఆర్ ఆర్బిటర్ మంగళవారం విక్రమ్ ల్యాండర్ పడిపోయిన ప్రాంతంవైపు వచ్చినప్పుడు కొన్ని ఫోటోలు తీసింది. వాటిని నాసా ఇస్రోకు పంపించగా, కొన్ని రోజుల క్రితం భారత్‌ ఆర్బిటర్ పంపిన ఫోటోలతో వాటిని సరిపోల్చి విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. 

కానీ ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఆ ప్రాంతంలో చీకటి పరుచుకుంటునందున, విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించడం కష్టంగా ఉందని తెలుస్తోంది. కనుక మళ్ళీ అక్టోబర్ 14న నాసా ఆర్బిటర్ ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు పూర్తి వెలుగు ఉంటుంది కనుక అప్పుడు తప్పకుండా గుర్తించవచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే విక్రమ్ ల్యాండర్‌తో సిగ్నల్ సంబంధాలు ఏర్పడకపోతే దానిని గుర్తించినా ఎటువంటి ప్రయోజనమూ ఉండకపోవచ్చు. చంద్రయాన్-2 ప్రయోగంలో తమకు అండగా నిలబడి సంఘీభావం ప్రదర్శించినందుకు భారతీయులందరికీ ఇస్రో శాస్త్రవేత్తలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. 

Related Post