భారత్‌ తొలి అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీసులు ఎక్కడంటే...

August 13, 2019
img

మెట్రో రైళ్ళు భూమికి కొంత ఎత్తులో నిర్మించిన స్తంభాలపై వేసిన ట్రాక్‌పై ప్రయాణిస్తాయని తెలుసు. డిల్లీ, కోల్‌కతా వంటి మహానగరాలలో భూమిలోపల సొరంగాలు తొలిచి మెట్రో రైళ్ళను నడిపిస్తుండటం చూశాము కానీ ఇంతవరకు నది కింద సొరంగమార్గాలు ఏర్పాటు చేసి వాటిలో మెట్రో రైళ్ళు నడిపించడం చూడలేదు. కానీ త్వరలోనే అదీ చూడబోతున్నాము. కోల్‌కతాలో హుగ్లీ నది క్రింద సుమారు 5 కిమీ పొడవైన సొరంగా మార్గం ఏర్పాటు చేసి దానిలో రెండు రైల్వే ట్రాకులను ఏర్పాటు చేసింది కోల్‌కతా మెట్రో రైల్ సంస్థ. దేశంలో ఇదే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైల్ అవుతుంది.  

కోల్‌కతాలోని సాల్ట్ లేక్ (సెక్టర్-5) స్టేషన్-స్టేడియం స్టేషన్లను కలుపుతూ హుగ్లీ నది కింద 30 మీటర్ల లోతులో ఈ మెట్రో ట్రాక్ నిర్మించబడింది. దీనిలో రెండువైపుల నుంచి మెట్రో రైళ్ళ రాకపోకల కోసం 520 మీటర్లు పొడవైన రెండు సొరంగాలు నిర్మించారు. దీని నిర్మాణ కార్యక్రమాలు దాదాపు పూర్తికావచ్చాయి. త్వరలోనే ఈ మార్గంలో మెట్రో రైళ్ళు తిరగడం ప్రారంభం అవుతుందని రైల్వేశాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.      


Related Post