చంద్రయాన్-2కు మళ్ళీ ముహూర్తం ఖరారు

July 18, 2019
img

భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం జూలై 15న జరుగవలసి ఉండగా ప్రయోగానికి సుమారు గంట ముందు ఉపగ్రహవాహక నౌక ఇంజనులో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ప్రయోగాన్ని నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే. క్రయోజనిక్ ఇంజనులో తలెత్తిన లోపాన్ని గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం దానిని సరిదిద్దుతున్నారు. కనుక ఈనెల 22న మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగం చేయబోతున్నట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగానికి 20 గంటల ముందు అంటే ఆదివారం సాయంత్రం 6.43 గంటల నుంచి మళ్ళీ కౌంట్ డౌన్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కౌంట్ డౌన్ సందర్భంగా చంద్రయాన్-2లో ప్రతీ పరికరాన్ని మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని సవ్యంగా పనిచేస్తున్నాయని నిర్దారించుకున్నాకనే తరువాతే నిర్దారిత సమయానికి ప్రయోగిస్తారు. ఈసారి చంద్రయాన్-2 ప్రయోగం నిరాటంకంగా...విజయవంతంగా  కొనసాగుతుందని ఆశిద్దాం. 


Related Post