దేశంలో మొట్టమొదటి కమాండ్ కంట్రోల్ హైదరాబాద్‌లో

May 22, 2019
img

దేశంలో మొట్టమొదటి అతి పెద్ద కమాండ్ కంట్రోల్ భవన సముదాయం హైదరాబాద్‌ నగరంలో బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో శరవేగంగా నిర్మితమవుతోంది. రూ.350 కోట్ల వ్యయంతో ఏడెకరాలలో నిర్మితమవుతున్న ఈ భవన సముదాయం ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. షాపూర్‌జీ-పల్లంజీ కంపెనీ 2016 డిసెంబరులో దీని నిర్మాణ పనులు ప్రారంభించింది. మరొక 7-8 నెలలలో నిర్మాణపనులు పూర్తికాబోతున్నాయి.  

1. రాష్ట్ర పోలీస్ శాఖకు ఇదే ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలో అందరూ పోలీస్ ఉన్నతాధికారులకు, అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు వెళుతుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని సిసి కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించబడతాయి. కనుక రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగిన వెంటనే కమాండ్ కంట్రోల్ అధికారులకు తెలిసిపోతుంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఇక్కడి నుంచే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అధికారులతోనైనా నేరుగా మాట్లాడవచ్చు.      

2. దీనిలో నాలుగు టవర్లు (బహుళ అంతస్తులు) ఉంటాయి. వాటిలో టవర్ ఏ 20 అంతస్తులు, బి,సి, డీ టవర్లలో ఒక్కొక్కటీ 16 అంతస్తులు కలిగి ఉంటాయి. 

3. ఏడు ఎకరాలలో నిర్మిస్తున్న ఈ నాలుగు టవర్లలో మొత్తం 6 లక్షల చ. అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటాయి. 

4. టవర్ ఏ 1.40 లక్షల చ.అ. విస్తీర్ణం, బి, సీ, డీ టవర్లు ఒక్కోటి 1.12 చ.అ. విస్తీర్ణం కలిగి ఉంటాయి. 

5. టవర్ ఏ పైన 14 సీటర్ల భారీ హెలికాప్టర్‌ దిగేందుకు వీలుగా హెలీ ప్యాడ్ కూడా నిర్మిస్తున్నారు.  

6. నాలుగు టవర్లను కలుపుతూ 14వ అంతస్తులో ఒక స్కై-వాక్-వేను ఏర్పాటు చేస్తున్నారు. 

7. నాలుగు టవర్ల మద్యలో నాలుగు అంతస్తులలో 44,000 చ.అ. విస్తీర్ణంలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. ఒక్కో అంతస్తు 11,000 చ.అ. విస్తీర్ణంతో ఉంటుంది. దానిలో 4వ అంతస్తులో డాటా సెంటర్, 5,6 అంతస్తులు మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గా ఉంటుంది. 

8. ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక పరికరాలను ఈ కమాండ్ కంట్రోల్ భవన సముదాయం ఏర్పాటు చేస్తున్నారు. 

9. ఏ- టవర్‌లో రాష్ట్ర డిజిపి, హైదరాబాద్‌ నగర పోలీస్ కమీషనర్, ఇతర ఉన్నతాధికారుల కార్యాలయాలు ఉంటాయి.    

10. బి- టవర్‌లో పోలీస్ శాఖకు చెందిన ఐ‌టితో సహా అన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల కార్యాలయాలు ఉంటాయి. దీనిలో 14వ అంతస్తులో తెలంగాణ గొప్పదనాన్ని, సంస్కృతీ సంప్రదాయాల చాటిచెప్పే మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. 14వ అంతస్తులో నాలుగు టవర్లను కలుపుతూ నిర్మింపబడుతున్న స్కై-వే మార్గంలో సందర్శకులు వాటి మద్యలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటరుని, హైదరాబాద్‌ నగరాన్ని చూడవచ్చు.     

11. సి-టవర్‌లో సమావేశ మందిరాలు, శిక్షణా కార్యాలయాలు, వగైరా ఉంటాయి. 

12. డి-టవర్‌లో పోలీస్ శిక్షణా కేంద్రం, కెఫీటేరియా, మీడియా లాంజ్ వగైరా ఉంటాయి.

13. నాలుగు టవర్లలో ఎక్కడా సిమెంట్ గోడలు కనిపించవు. గోడలన్నీ గాజు పలకలతోనే నిర్మిస్తున్నారు. వాటి విస్తీర్ణం సుమారు 3 లక్షల చ.అ. ఉంటుంది. అలాగే 053 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయగల 5200 సోలార్ గాజు పలకాలను భవనం చుట్టూ బిగిస్తున్నారు. 

14. ఈ భవనంలోని నాలుగు టవర్లను కలుపుతూ ఆకాశమార్గం ఏర్పాటు చేశారు. టవర్‌ ‘బి’లోని 14వ అంతస్తులో తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేసే మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నారు. టవర్‌ ‘డి’ నుంచి ఈ ఆకాశమార్గంలోకి సందర్శకులు వచ్చి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను చూసి మ్యూజియంను సందర్శించేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. 


15. సెల్లారులో 630 కార్లు పార్కింగ్ చేసుకొనే విదంగా నిర్మిస్తున్నారు. 

16. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కాంప్లెక్స్ నుంచి విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేసేందుకు రోజుకు 180 కిలోలీటర్ల సామర్ధ్యం కలిగిన వెస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

17. ఈ కమాండ్ సెంటర్ నలువైపుల ఎత్తైన వాచ్-టవర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Related Post