డ్రోన్లను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా...గ్రేట్!

January 19, 2018
img

ఈ దశాబ్దంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక సాధనాలలో ‘డ్రోన్లు’ కూడా ఒకటి. విదేశాలలో వీటిని చాలా కాలంగానే వినియోగిస్తున్నప్పటికీ ఇప్పుడిప్పుడే అవి భారత్ లో కూడా అన్ని రంగాలలోకి ప్రవేశిస్తున్నాయి. భారతీయ రైల్వేలు, పోలీస్ శాఖలు, కోస్ట్ గార్డ్ వంటి వివిధ సంస్థలు డ్రోన్లను విరివిగా ఉపయోగించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణ పనుల పరిశీలనకు వాటిని విరివిగా ఉపయోగించుకొంటున్నాయి. ఆలోచన చేయగలిగితే డ్రోన్లను ఇంకా అనేక రంగాలలో అనేకవిధాలుగా ఉపయోగించుకోవచ్చునని నిరూపించే ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. 

లెన్నాక్స్ హెడ్ అనే ప్రాంతంలో సముద్రంలో ఈతకు వెళ్ళిన ఇద్దరు యువకులు మునిగిపోతుంటే గుర్తించిన సిబ్బంది ఆ సమాచారాన్ని కంట్రోల్ రూమ్ లో ఉన్న ‘డ్రోన్ పైలట్’ కు తెలియజేయగానే, అతను వెంటనే డ్రోన్ ద్వారా సముద్రంలో మునిగిపోతున్న వారిరువురికీ లైఫ్ సేవింగ్ కిట్స్ అందజేశారు. ఈలోగా కోస్ట్ గార్డ్ సిబ్బంది అక్కడకు పడవలలో చేరుకొని వారిద్దరినీ రక్షించారు. అంటే డ్రోన్ సేవలను ఎక్కడెక్కడ ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకొంటే చాలు అవి చాలా అమూల్యమైన సేవలు అందిస్తాయని అర్ధం అవుతోంది.

Related Post