వాట్స్ అప్ లో మరో కొత్త ఫీచర్

January 12, 2018
img

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో వాట్స్ అప్ ను వాడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దానిలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ జోడిస్తూ అందరికీ ఇంకా ఎక్కువ ఉపయుక్తంగా మార్చడమే అందుకు కారణం. వాట్స్ అప్ త్వరలో మరో సరికొత్త ఫీచర్ ను అందించబోతోంది. 

ఇప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర ఉద్యోగులు లేదా వేర్వేరు సమూహాలు వాట్స్ అప్ లో వేర్వేరుగా గ్రూప్స్ క్రియేట్ చేసుకొంటున్నారు. ఆ గ్రూప్ కి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది నిర్వాహకులు (అడ్మిన్)గ ఉండవచ్చు. గ్రూప్ అడ్మిన్ గా ఉన్న వ్యక్తిని ఆ బాధ్యత నుంచి తొలగించాలంటే ఇదివరకు అతను లేదా ఆమె నెంబరును గ్రూప్ నుంచి డిలీట్ చేసి మళ్ళీ ఎంటర్ చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ బాధలేకుండా నేరుగా ‘డిస్మిస్ యాజ్ అడ్మిన్’ అనే ఫీచర్ ను వాట్స్ అప్ ప్రవేశపెట్టబోతోంది. దాని ద్వారా అడ్మిన్ గా ఉన్న వ్యక్తిని వాట్స్ అప్ గ్రూప్ నుంచి తొలగించకుండానే అడ్మిన్ బాధ్యతల నుంచి తప్పించవచ్చు. 

దీనితోబాటు మరో కొత్త ఫీచర్ ను కూడా జోడించబోతోంది. వాట్స్ అప్ కాల్స్ నుంచి వీడియో కాల్స్ లోకి మళ్ళీ వాయిస్ కాల్స్ లోకి మారేందుకు ‘క్విక్ స్విచ్’ అనే బటన్ జోడించబోతోంది. త్వరలోనే ఈ రెండు ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. 

Related Post