2023 వన్డే వరల్డ్ కప్ భారత్ లోనే!

December 15, 2017
img

భారత క్రికెట్ క్రీడాభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పింది. 2021లో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీని, 2023లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ పోటీలను భారత్ లోనే నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. మొన్న ముంబైలో జరిగిన బిసిసిఐ సర్వ సభ్యసమావేశం అనంతరం వీటిని అధికారికంగా దృవీకరిస్తూ బిసిసిఐ ప్రకటన చేసింది. 2019లో జరుగబోయే వరల్డ్ కప్ పోటీలు ఇంగ్లాండ్ లో జరుగుతాయి. దానితో కలుపుకొని మళ్ళీ 2023లో జరుగబోయే వరల్డ్ కప్ పోటీల వరకు టీం ఇండియా మొత్తం 81 మ్యాచ్ లు ఆడుతుందని బిసిసిఐ ప్రకటించింది. 

భారత్ ఇంతకు ముందు 1987, 1996, 2011లో వరల్డ్ కప్ పోటీలను నిర్వహించింది. కానీ వాటిని ఇతరదేశాలతో కలిసి నిర్వహించింది. 2021, 23 సం.లలో జరుగబోయే పోటీలకు మాత్రం పూర్తిగా భారత్ ఆతిధ్యంలోనే జరుగబోతున్నాయి. భారత్ 1983,2011 మ్యాచ్ లలో వరల్డ్ కప్ గెలుచుకొంది. 

Related Post