సీనియర్ క్రికెటర్ మృతి

November 10, 2017
img

1960 దశకంలో భారత్ క్రికెట్ టీంలో స్టైలిష్ క్రికెటర్ గా పేరొందిన మిల్కా సింగ్ (75) శుక్రవారం చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అయన తన 17వ ఏటనే అప్పటి మద్రాస్ (ఇప్పటి తమిళనాడు) నుంచి రంజీ ట్రోఫీలోకి ప్రవేశించారు. అయన సోదరుడు కృపాల్ సింగ్ కూడా భారత్ క్రికెట్ టీం తరపున 14 టెస్ట్ మ్యాచులు ఆడారు. 1961-62 సం.లలో అన్నదమ్ములిద్దరూ భారత్ టీం తరపున ఆడారు. మిల్కా సింగ్ అనేక జాతీయ, అనతర్జాతీయ మ్యాచ్ లలో ఆడారు. 1960లో నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 8 సెంచరీలతో 4,000 పైగా పరుగులు చేశారు. 1987లో తమిళనాడు-గోవా మ్యాచ్ లో ఆయన తమిళనాడు తరపున ఆది ఏకంగా మూడు సెంచరీలు చేశారు. మిల్కా సింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మ్యాన్. మంచి ఫీల్డర్ గా కూడా గుర్తింపు సంపాదించుకొన్నారు. ఆయనకు భార్య, కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 

భారత్ టీం మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ మిల్కా సింగ్ మృతికి సంతాపం తెలిపారు. బిసిసిఐ మరియు టీం ఇండియాలో పలువురు అయన మృతికి సంతాపం తెలిపారు.              


Related Post