భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు

October 13, 2017
img

ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మద్య రాత్రి 7.30 గంటల నుంచి జరుగవలసిన మూడవ టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీనితో స్టేడియంకు బారీగా తరలివచ్చిన అభిమానులు తీవ్ర నిరాశతో వెనుతిరిగుతున్నారు. సాయంత్రం నుంచే స్టేడియంలో చిరుజల్లులు పడటం మొదలయ్యి క్రమంగా వర్షం పెరిగింది. అయినా వర్షం ఏమాత్రం తెరిపిచ్చినా కొన్ని ఓవర్లు కుదించి అయినా ఆడుదామనిరెండు టీములు ఎదురుచూశాయి. అంపైర్లు కూడా రెండు మూడు సార్లు ఫీల్డ్ పరిశీలింఛి వచ్చారు.  కానీ అంతకంతకు వర్షం పెరిగిందే కానీ తగ్గలేదు. ఆకారణంగా అవుటర్ ఫీల్డ్ అంతా నీళ్ళతో నిండిపోయి జారుడుగా మారిపోయింది. ఇక చేసేదేమీ లేక మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఈ మూడు మ్యాచ్ సిరీస్ లో భారత్-ఆస్ట్రేలియాలు చెరో మ్యాచ్ గెలుచుకొన్న కారణంగా రెండు టీములు 1-1 తో సమానం అయ్యాయి. కనుక టి-20 కప్ ను రెండు టీములు కలిసి అందుకొన్నాయి.    


Related Post