ధోనీకి పద్మభూషణ్?

September 21, 2017
img

ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును బిసిసిఐ నామినేట్ చేసింది. ధోనీ పేరును బిసిసిఐ బోర్డు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా బలపరిచి ఆమోదించారని తెలిపింది. సాధారణంగా బిసిసిఐ నామినేట్ చేసినవారికే పద్మా అవార్డులు తప్పకుండా లభిస్తుంటాయి. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియా 2011 వరల్డ్ కప్ గెలుచుకొంది. అంతకుముందు 2007లో వరల్డ్ టి-20 మ్యాచ్ కూడా గెలుచుకొంది. కనుక ఈ అవార్డు పొందడానికి ధోనీ అన్నివిధాల అర్హుదేనని చెప్పవచ్చు. కనున ధోనీకి ఈ అవార్డు ఖచ్చితంగా లభిస్తుందని భావించవచ్చు. 

క్రికెట్ క్రీడాభిమానులకు, ముఖ్యంగా ధోనీ అభిమానులకు ఆయన సాధించిన రికార్డులు కంటోపాఠమే. అయినప్పటికీ ఈ అవార్డుకు నామినేట్ చేయబడిన సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకోక తప్పదు. 

1. 302 వన్డేలు ఆడిన ధోనీ వాటిలో మొత్తం 9,737 పరుగులు చేశాడు. 

2. అలాగే 90 టెస్ట్ మ్యాచ్ లలో 4,876 పరుగులు చేశాడు. 

3. 78 టి-20 మ్యాచ్ లలో 1212 పరుగులు చేశాడు. వాటిలో 16 సెంచరీలు చేశాడు.

4. టీమిండియాలో బెస్ట్ వికెట్ కీపర్ గా నిలిచాడు. వికెట్ కీపర్ గా 584 క్యాచ్ లు పట్టాడు. 

5. ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియా 2011 వరల్డ్ కప్ గెలుచుకొంది. 

6. ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియా 2007లో వరల్డ్ టి-20 గెలుచుకొంది.

7. క్రీడారంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించబడే రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డును అందుకొన్నారు. 

8. అలాగే ధోనీ పద్మశ్రీ అవార్డు కూడా అందుకొన్నారు. ఇప్పుడు ఈ అవార్డు కూడా అందుకొంటే దానిని పొందిన క్రికెటర్లలో ధోనీ 11వ వ్యక్తి అవుతాడు.  

Related Post