శ్రీశాంత్ హ్యాపీ..ఆ ఒక్కటీ నెరవేరితే చాలుట!

August 08, 2017
img

భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా జీవితకాల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేరళ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుపై శ్రీశాంత్ స్పందిస్తూ, “నాపై వచ్చిన ఆరోపణలు నిజం కావని, నేను నిర్దోషినని మొదటి నుంచి చెపుతూనే ఉన్నాను. ఇన్నాళ్ళకు హైకోర్టు తీర్పుతో అది రుజువైంది. నా జీవితకాల లక్ష్యం ఎప్పటికైనా భారత్ తరపున ప్రపంచ కప్ లో ఆడి భారత్ ను గెలిపించాలని. నాపై నిషేధం ఎత్తివేయబడింది కనుక 2019 ప్రపంచ కప్ లో టీం ఇండియాలో నాకు చోటు లభిస్తుందని ఆశిస్తున్నాను. భారత టీంలో చాలా మంది పేస్ బౌలర్లున్నారు. కనుక నాకు వాళ్ళ నుంచి గట్టి పోటీయే ఉంటుందని తెలుసు. సచిన్ టెండూల్కర్ వంటివాళ్ళు 40 ఏళ్ళు వయసు వచ్చే వరకు టీం ఇండియా తరపున ఆడారు. ఇప్పుడు నాకింకా 34 ఏళ్ళు వయసే కనుక టీం ఇండియాలో నాకు స్థానం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈలోగా నేను కేరళ టీం తరపున ఆడి దానికి రంజీట్రోఫీ సాధించేందుకు గట్టిగా కృషి చేస్తాను,” అని అన్నారు శ్రీశాంత్.  

శ్రీశాంత్ పై జీవితకాల నిషేధం ఎత్తివేస్తునట్లు కేరళ హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ బిసిసిఐ ఇంతవరకు స్పందించలేదు. కనుక శ్రీశాంత్ కు మళ్ళీ టీం ఇండియాలో చోటు కల్పిస్తుందో లేదో చూడాలి. 

Related Post