వరల్డ్ కప్ పార్టీ వాళ్ళకే

July 24, 2017
img

లండన్ లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన మహిళల వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ పై ఇంగ్లాండ్ విజయం సాధించి వరల్డ్ కప్ గెలుచుకొంది. ఇంతవరకు జరిగిన మ్యాచ్ లలో భారత్ టీమ్ వరుస విజయాలు సాధిస్తూ హేమాహేమీలను మట్టి కరిపించడం చూసి మన టీమ్ తప్పకుండా వరల్డ్ కప్ అందరూ గట్టిగా నమ్మారు. మిథాలి సేన ఫైనల్స్ చేరుకోవడంతో ఆ ఆశలు ఇంకా పెరిగాయి. కానీ మిథాలి సేన కూడా మన భారత్ టీమ్ లకు ఎప్పుడూ ఫైనల్స్ లో తడబడే అలవాటుపో(లే)దని నిరూపించి చూపించింది. అలవోకగా గెలిచే అవకాశాలున్నప్పటికీ చేజేతులా ఒక సువర్ణావకాశాన్ని జారవిడుచుకొని వరల్డ్ కప్ ను ఇంగ్లాండ్ చేతికి అప్పగించింది. 

 మొదట టాస్ గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లాండ్ టీమ్ ను భారత్ బౌలర్లు చాలా చక్కగానే కట్టడి చేశారు. 50 ఓవర్లలో 7 వికెట్లకు 228 పరుగులు చేయగలిగారు. మన ఇండియన్ టీమ్ మొదటి నుంచి చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తునందున 229 పరుగుల ఆ లక్ష్యాన్ని అవలీలగా చేధించగలరనే అందరూ ఆశించారు. మొదట ఓపెనర్‌ గా బరిలో దిగిన స్మృతి మంధాన డకౌట్, కెప్టెన్ మిథాలి 17 రన్స్ కే అవుటయినా పూనం రౌత్ (86), హార్మన్ ప్రీత్ కౌర్ (51) నిలకడగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయారు. హార్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిన తరువాత బ్యాటింగ్ కు వచ్చిన వేద కృష్ణమూర్తి కూడా విజ్రుంబించడంతో వారిరువురు కలిసి ఇండియాను గెలిపించబోతున్నారనే భావన అందరిలో కలిగింది. 43వ ఓవర్స్ కు ఇద్దరూ కలిసి స్కోరును 191 రన్స్ కు చేర్చారు. మరో 38 పరుగులు సాధిస్తే వరల్డ్ కప్ భారత్ చేతికి వచ్చేసేది. కానీ ఆమె భాగస్వామి పూనం కౌర్ ఎల్బీ అవడంతో భారత్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తరువాత వచ్చినవారందరూ ఒకరితరువాత మరొకరు చొప్పున వరుసగా అవుట్ అయిపోయయారు. వారిలో దీప్తిశర్మ 14 రన్స్ చేసి కాస్త నిలద్రొక్కుకోవడం తో భారత్ ఆశలు మళ్ళీ చిగురించాయి కానీ 49 ఓవర్లో దీప్తి, గైక్వాడ్‌ అవుట్ అవడంతో భారత్ టీమ్ కేవలం 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి వరల్డ్ కప్ చేజార్చుకొంది.      

స్కోర్ బోర్డ్: 

భారత్: పూనమ్‌ రౌత్‌ (ఎల్బీ) ష్రబ్‌సోల్‌ 86, మంధాన (బి) ష్రబ్‌సోల్‌ 0, మిథాలీ (రనౌట్‌/సీవర్‌) 17, హర్మన్‌ప్రీత్‌ (సి) బ్యూమౌంట్‌ (బి) హార్ట్‌లీ 51, వేద కృష్ణమూర్తి (సి) సీవర్‌ (బి) ష్రబ్‌సోల్‌ 35, సుష్మా వర్మ (బి) హార్ట్‌లీ 0, దీప్తి శర్మ (సి) సీవర్‌ (బి) ష్రబ్‌సోల్‌ 14, గోస్వామి (బి) ష్రబ్‌సోల్‌ 0, శిఖా పాండె (రనౌట్‌/ష్రబ్‌సోల్‌) 4, పూనమ్‌ యాదవ్‌ (నాటౌట్‌) 1, రాజేశ్వరి గైక్వాడ్‌ (బి) ష్రబ్‌సోల్‌ 0, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 48.4 ఓవర్లలో 219 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-5, 2-43, 3-138, 4-191, 5-196, 6-200, 7-201, 8-218, 9-218; బౌలింగ్‌: బ్రంట్‌ 6-0-22-0, ష్రబ్‌సోల్‌ 9.4-0-46-6, సీవర్‌ 5-1-26-0, జెన్నీగన్‌ 7-2-17-0, లారామార్ష్‌ 10-1-40-0, హార్ట్‌లీ 10-0-58-2, హీదర్‌నైట్‌ 1-0-7-0.

ఇంగ్లాండ్: విన్‌ఫీల్డ్‌ (బి) గైక్వాడ్‌ 24, బ్యూమాంట్‌ (సి) గోస్వామి (బి) పూనమ్‌ యాదవ్‌ 23, టేలర్‌ (సి) సుష్మ (బి) గోస్వామి 45, హీదర్‌ (ఎల్బీ) పూనమ్‌ యాదవ్‌ 1, సీవర్‌ (ఎల్బీ) గోస్వామి 51, విల్సన్‌ (ఎల్బీ) గోస్వామి 0, బ్రంట్‌ (రనౌట్‌/దీప్తి) 34, జెన్నీ గన్‌ (నాటౌట్‌) 25, లారా మార్ష్‌ (నాటౌట్‌) 14; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 50 ఓవర్లలో 228/7; వికెట్ల పతనం: 1-47, 2-60, 3-63, 4-146, 5-146, 6-164, 7-196; బౌలింగ్‌: గోస్వామి 10-3-23-3, శిఖా పాండే 7-0-53-0, గైక్వాడ్‌ 10-1-49-1, దీప్తి శర్మ 9-0-39-0, పూనమ్‌ యాదవ్‌ 10-0-36-2, హర్మన్‌ప్రీత్‌ 4-0-25-0.

Related Post