శబాష్ భారత్ కా బేటీ

July 22, 2017
img

మన టీం ఇండియా క్రికెట్ జట్టు మన బద్ధ విరోధి పాకిస్తాన్ చేతిలో ఘోరంగా ఓడిపోయి పరువు తీస్తే, మన ఇండియన్ మహిళా క్రికెట్ టీం ఐసిసి మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో వరుసగా తమ ప్రత్యర్ధులు అందరినీ చిత్తు చిత్తు చేస్తూ ఫైనల్స్ కు చేరుకొంది. ఈ క్రెడిట్ టీం కెప్టెన్ మిథాలికే దక్కుతుంది. ఇంతవరకు ఆడిన అన్ని మ్యాచ్ లలో అద్భుతంగా ఆడుతూ తనకు, తన టీంకు, భారత్ కు కూడా మంచిపేరు సంపాదించింది. ఇంతవరకు మన దేశంలో ఎంత గొప్ప క్రికెట్ అభిమాని అయినా సరే మహిళా క్రికెట్ టీం గురించి మాట్లాడింది లేదు. కానీ ఈసారి ఆ టీం కెప్టెన్ మిథాలి, అద్భుతంగా  బ్యాటింగ్ చేస్తున్న హర్మన్ ప్రీత్‌ కౌర్‌, వేద కృష్ణమూర్తి, స్మృతి మంధాన, పూనమ్‌ కౌర్‌ ల గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇంతకాలం ఈ గొప్ప ప్లేయర్స్ నేనా మనం చిన్న చూపు చూసింది అని క్రికెట్ అభిమానులు అనుకోకుండా ఉండలేకపోతున్నారు. 

బిసిసిఐ కూడా వారి అద్భుతమైన ఆట తీరు..వారి వరుస విజయాలు చూసి “శబాష్ మిథాలి..శబాష్ ఇండియా కా బేటీ...”అంటూ వారిపై అభినందనలు కురిపిస్తోంది. వారు ఫైనల్స్ చేరిన సందర్భంగా ఆ టీంలో ప్లేయర్స్ అందారికీ ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు నగదు బహుమానం కూడా ప్రకటించింది. వారి సహాయ సిబ్బందికి కూడా తలో రూ.25 లక్షలు చొప్పున నగదు బహుమానాలు ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లాండ్ లోని లార్డ్స్‌ వేదికగా జరుగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీంను మన మిథాలి సేన డ్డీ కొనబోతోంది. ఫైనల్ మ్యాచ్ లో తప్పకుండా గెలిచి వరల్డ్ కప్ సాధించి తెస్తామని మిథాలి సేన గట్టి విశ్వాసంతో ఉంది. 

Related Post