మిథాలి రాజ్ సరికొత్త రికార్డు

July 12, 2017
img

భారత్ మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలి రాజ్ సరికొత్త రికార్డు నెలకొల్పారు.  ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ చార్లోట్ ఎడ్వర్డ్ 191 మ్యాచ్ లలో 5,992 రన్స్ చేసి నెలకొల్పిన రికార్డును మిథాలి రాజ్ 183 మ్యాచులలోనే 5,993 రన్స్ చేసి అధిగమించారు. బ్రిస్టల్లో జరుగుతున్న వరల్డ్ కప్ పోటీలలో బుధవారం ఆస్ట్రేలియా టీమ్ తో ఆడినప్పుడు మిథాలి రాజ్, పూనం రౌత్ తో కలిసి 155 పరుగులు తీశారు. ఈ మ్యాచ్ తో మిథాలి రాజ్ 6,000 పరుగులు సాధించిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ గా రికార్డు సృష్టించారు. 

ఆమెకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ తదితరులు ట్వీట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. 


Related Post