కాదన్నవాడే టీమ్ ఇండియా కోచ్

July 12, 2017
img

టీమ్ ఇండియా కోచ్ ఎంపిక ప్రక్రియలో బిసిసిఐ తడబాటు ప్రదర్శించి మళ్ళీ నవ్వుల పాలయింది. మొదట రవిశాస్త్రిని కోచ్ గా నియమించినట్లు ప్రకటించింది. తరువాత కాదని చెప్పింది. మళ్ళీ కొన్ని గంటల వ్యవధిలోనే రవిశాస్త్రినే టీమ్ ఇండియా కోచ్ గా నియమిస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఆయన ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తారని, మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్ గా, విదేశీ పర్యటనలలో రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తారని బిసిసిఐ ప్రకటించింది. దీనిని అధికారికంగా నిన్న రాత్రి ప్రకటించింది. కనుక కోచ్ విషయంలో ఇక మార్పులు ఉండవని భావించవచ్చు.        


Related Post