టీమ్ ఇండియా కోచ్ ఎవరంటే..

July 11, 2017
img

టీమ్ ఇండియా కోచ్ పేరును మరికొంత సమయం తీసుకొని ప్రకటిస్తామని సెలక్షన్ ప్యానల్ కు బిసిసిఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ అక్షింతలు వేయడంతో రవిశాస్త్రిని టీమ్ ఇండియా కోచ్ గా నియమిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. సచిన్, వివిఎస్ లక్ష్మణ్, గంగూలితో కూడిన సెలక్షన్ ప్యానల్ నిన్న ఈ పదవి చేపట్టడానికి ముందుకు వచ్చిన రవి శాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, లాల్ చంద్ రాజ్ పుట్, టామ్ మూడీ, రిచర్డ్ పిబాస్ లను ఇంటర్వ్యూలు చేశారు. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడి అతని అభిప్రాయం కూడా తీసుకొన్న తరువాత కోచ్ పేరు ప్రకటిస్తామని గంగూలీ చెప్పడాన్ని వినోద్ రాయ్ తప్పు పట్టారు. ఈరోజు సాయంత్రంలోగా కోచ్ పేరు ప్రకటించాలని గడువు విదించడంతో సెలక్షన్ ప్యానల్ సభ్యులు ముగ్గురూ మళ్ళీ అత్యవసరంగా సమావేశమయ్యి రవి శాస్త్రి పేరును ఖరారు చేసి ప్రకటించారు. దీనితో గత కొన్ని రోజులుగా కోచ్ గా ఎవరిని నియమించబోతున్నారనే సస్పెన్స్ కు తెరపడింది. 


Related Post