క్రికెట్ అభిమానులకు శుభవార్త

January 21, 2021
img

భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త తెలిపింది. త్వరలో చెన్నై, అహ్మదాబాద్‌ నగరాలలో జరగబోయే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు అనుమతించబోతున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచ్‌లు చూసేందుకు వచ్చేవారందరూ తప్పనిసరిగా కోవిడ్  నిబంధనలు పాటించవలసి ఉంటుందని తెలిపింది. ప్రేక్షకులు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి రావాలని, శానిటైజర్‌ను దగ్గర ఉంచుకోవాలని బీసీసీఐ  తెలిపింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

టెస్ట్ మ్యాచ్‌ల వివరాలు: 

మొదటి టెస్ట్ మ్యాచ్: ఫిబ్రవరి తేదీ 5నుండి 9 వరకు, వేదిక: చెన్నై

రెండవ టెస్ట్ మ్యాచ్: ఫిబ్రవరి తేదీ 13 నుండి 17వరకు, వేదిక: చెన్నై

మూడవ టెస్ట్ మ్యాచ్: ఫిబ్రవరి 24 తేదీ నుండి 28వరకు, వేదిక: అహ్మదాబాద్. (ఈ టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ గా జరగనుంది). 

నాలుగో టెస్ట్ మ్యాచ్: మార్చి 4వ తేదీ నుండి 8వరకు, వేదిక: అహ్మదాబాద్. 

భారత్ జట్టు: 

 విరాట్ కోహ్లీ( కెప్టెన్), అజాకె రెహనా( వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్( వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహో( వికెట్ కీపర్), ఆర్‌. అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బూమ్రా, మహ్మద్  సిరాజ్, శార్దూల్ ఠాకూర్. 

Related Post