ఐపీఎల్‌కు సన్నాహాలు షురూ

January 08, 2021
img

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)14కు సన్నాహాలు మొదలయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్‌ నెలల్లో జరగనున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు ఉన్నాయి. ఐపిఎల్ జట్టుల ఫ్రాంఛైజీలకు ఈనెల 21 వరకు ఆటగాళ్లను రిటన్ చేసుకునేందుకు గడువు ఇచ్చింది.

 ఐపీఎల్ ప్రస్తుత చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ ట్రేడింగ్ విండోను ఫిబ్రవరి 4న మూసివేయనున్నట్లు తెలిపారు. ఎనిమిది జట్ల మినీవేలం వచ్చే నెలలో రెండవ లేదా మూడో వారంలో ఉండవచ్చని తెలిపారు. ఐపీఎల్ 14 భారత్‌లోనే నిర్వహిస్తారా.. లేదా విదేశాలలో నిర్వహిస్తారా...? అనే విషయం తెలియాలంటే కొన్ని నెలలు వేచి చూడక తప్పదు.  ఐపీఎల్ క్రికెట్ అభిమానులు మాత్రం మ్యాచ్‌లు భారత్‌లోనే జరగాలని కోరుకుంటున్నారు. ఐపీఎల్ 14 షెడ్యూల్‌కు బీసీసీఐ త్వరలోనే తుది రూపు ఇవ్వనుంది.


Related Post