ఆస్ట్రేలియాపై పట్టు బిగిస్తున్న భారత్‌ జట్టు

December 28, 2020
img

ఆస్ట్రేలియాతో రెండో రోజు మ్యాచ్‌లో కాస్త పట్టు బిగించిన భారతజట్టు మూడో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ 326 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. రహేన 112 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్ట్రాక్ మూడు వికెట్లు, లయన్‌కు మూడు వికెట్లు, కమ్నీస్‌కు రెండు వికెట్లు పడ్డాయి. భారత్ 131 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడడానికి వచ్చింది. మూడో రోజు ఆట ముగిసే వరకు ఆస్ట్రేలియా 133 పరుగులతో ఆరు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా జట్టులో మాథ్యూ వేడ్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నారు. భారత బౌలర్లలో జడేజాకు రెండు వికెట్లు, మిగతా బౌలర్లకు తల ఒక్క వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం క్రీజులో కామరూన్ గ్రీన్ 17 పరుగులు, పాట్ క్యూమిన్  15 పరుగులతో ఆడుతున్నారు. రెండో టెస్ట్ ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది కనుక ఒకవేళ భారత్ బౌలర్లు, బ్యాట్స్ మ్యాన్ సమిష్టిగా రాణించినట్లయితే విజయం మనదే అవుతుంది. 


Related Post