ఐపీఎల్-13 టైటిల్ మళ్ళీ ముంబైకే

November 11, 2020
img

ఐపీఎల్-13లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ టీం మళ్ళీ విజయం సాధించి వరుసగా 5వసారి టైటిల్ గెలుచుకొంది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 4వ సారి ముంబై ఇండియన్స్ టీం చేతిలో ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయి టైటిల్ మరోసారి చేజార్చుకొంది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్-4 ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 

నిన్న మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఏకపక్షంగానే సాగింది. మొదట టాస్ గెలుచుకొని బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకే 157 రన్స్ చేసి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయి ఆడాడు. 51 బాల్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్స్ తో 65 రన్స్ చేసి నాటవుట్‌గా నిలిచి ముంబై ఇండియన్స్ కు మరోసారి గ్రాండ్ టైటిల్ సాధించాడు. బౌల్ట్ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డ్ లభించింది.  


Related Post