కపిల్‌దేవ్‌కు గుండెపోటు...వెంటనే శస్త్రచికిత్స

October 23, 2020
img

భారత్‌ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌కు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఢిల్లీలోని ఫోర్టీస్ ఎస్కార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే ఆయనకు యాంజియో ప్లాస్టీ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వైద్యులు అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. ఈ విషయం తెలియడంతో దేశవిదేశాలలో క్రికెట్ క్రీడాకారులు, సినీ, రాజకీయనాయకులు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు కపిల్‌దేవ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తూ ట్వీట్ చేస్తున్నారు.    


Related Post