రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు ఖరారు

August 19, 2020
img

క్రీడలలో అత్యుత్తమ ప్రతిభా కనబరిచిన క్రీడాకారులకు కేంద్రప్రభుత్వం ఏటా ఖేల్ రత్న అవార్డులతో సన్మానిస్తుంటుంది. ఈ ఏడాది ఒకేసారి ఐదుగురు క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డులకు ఎంపిక చేసింది. కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మందితో కోడిన ప్యానెల్ రాజీవ్ ఖేల్ రత్న, అర్జున, ధ్యాన్ చంద్ మరియు ద్రోణాచార్య అవార్డులకు క్రీడాకారులను ఎంపిక చేసింది. 

రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైనవారు:  

రోహిత్ శర్మ (క్రికెట్), రాణి రాంపాల్ (హాకీ), మనికా బాత్రా (టేబిల్ టెన్నిస్), వినేష్ ఫోగాట్ (రెజ్లింగ్), మరియప్పన్ తంగవేలు (పారాలింపిక్స్)ను ఈ ప్రతిష్టాతమకమైన అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డులకు ఎంపికైన వారికి పాతకంతో పాటు రూ.7.5 లక్షలు నగదు బహుమతిని అందజేస్తుంది.   

వీరితో పాటు అర్జున అవార్డుకు కూడా 29 క్రీడాకారుల పేర్లను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వీరికి పాతకంతో పాటు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు నగదు బహుమతిని అందజేస్తారు.  

ఇషాంత్ శర్మ (క్రికెట్), దీప్తి శర్మ(క్రికెట్), దీపికా (హాకీ), ఆకాష్ దీప్ (హాకీ), దివిజ్ శరణ్ (టెన్నిస్), మధురిక (టేబిల్ టెన్నిస్), విశేష్ (బాస్కెట్ బాల్), సందేశ్ (ఫుట్ బాల్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), దీపక్ హుడా (కబాడీ),   సారిక (కోకో). 

లవ్లీనా (బాక్సింగ్), మనీష్ (బాక్సింగ్), రాహుల్ అవారే (రెజ్లింగ్), సాక్షి మల్లిక్(రెజ్లింగ్), దివ్య కర్కన్ (రెజ్లింగ్), మీరాబాయ్ (వెయిట్ లిఫ్టింగ్), మనూ బాకర్ (షూటింగ్), సౌరభ్ (షూటింగ్), మనీషా అగర్వాల్ (పారా షూటర్),  అథౌను దాస్ (ఆర్చరీ).   

సుయాంష్ (పారా స్విమ్మర్), దత్తు బొకానల్ (రోయింగ్), ద్యుతి చంద్ (అథ్లెటిక్స్), సందీప్ (పారా అథ్లెట్), శివ కేశవన్ (వింటర్ స్పోర్ట్స్), అధితి అశోక్ (గోల్ఫ్), అజయ్ (టెంట్ పెగ్గింగ్).   

ఈ రెండు అవార్డులు కాక ద్రోణాచార్య అవార్డుకు 13 మందిని, ధ్యాన్ చంద్ అవార్డుకు 15 మంది క్రీడాకారులను కూడా ఎంపిక చేసింది. వీరందరికీ జాతీయ క్రీడా దినోత్సవంనాడు అంటే ఆగస్ట్ 29వ తేదీన వర్చువల్ పద్దతిలో అవార్డులను అందజేయనున్నట్లు తెలుస్తోంది.   


Related Post