ఈసారి ఐపీఎల్ స్పాన్సర్ ఎవరంటే...

August 18, 2020
img

భారత్‌-చైనా మద్య ఘర్షణల ప్రభావం ఐపీఎల్‌పై కూడా పడింది. ఇంతకాలం దానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో  చైనా కంపెనీ కావడంతో ఈసారి దానిని పక్కన పెట్టి దాని స్థానంలో కొత్త స్పాన్సర్ కోసం ఐపీఎల్ వేలంపాట నిర్వహించింది. దానిలో పాల్గొన్న బైజూస్ రూ.125 కోట్లు, టాటా గ్రూప్ రూ.180 కోట్లు, ఆన్‌ అకాడమీ రూ.220 కోట్లకు బిడ్లు వేయగా వారందరి కంటే ఎక్కువ వేసిన డ్రీమ్ 11 కంపెనీ ఐపీఎల్ స్పాన్సర్ షిప్ దక్కించుకొంది. ఆ కంపెనీ రూ.250 కోట్లకు బిడ్ వేసింది. దాంతో అదే 13వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లకు స్పాన్సర్‌గా ఎంపికయ్యింది. ఇవాళ్ళ సాయంత్రం బీసీసీఐ దీనిని అధికారికంగా ప్రకటించనుంది. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్‌లో ఐపీఎల్ మ్యాచ్ లు మొదలవుతాయి. 


Related Post